Skip to main content

Warangalvoice

ఆటో డ్రైవర్ల‌కు అండగా ఉంటా

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వ‌రంగ‌ల్ వాయిస్‌, క‌రీమాబాద్ : ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్బంగా తెలంగాణ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమ‌వారం భారీ ర్యాలీ, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంత‌రం జెండా ఆవిష్కరించి ఆటో డ్రైవర్ల‌నుద్దేశించి మాట్లాడారు. ఉద్యమనేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్ని…

Read More

రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ అధ్య‌క్షుడిగా అశోక్‌బాబు

నూత‌న క‌మిటీ ప్ర‌మాణ స్వీకారం వ‌రంగ‌ల్ వాయిస్‌, ఖిలా వ‌రంగ‌ల్ : రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సం సోమ‌వారం కాశిబుగ్గలోని వేడుకల మందిరంలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ గవర్నర్ డాక్ట‌ర్‌ శరత్ బాబు నూతన కమిటీచే ప్రమాణస్వీకారం చేయించారు. క్లబ్ ప్రెసిడెంట్‌గా బేతి అశోక్ బాబు, సెక్రటరీగా భేతి సతీష్, కోశాధికారిగా ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ సంద‌ర్భంగా నూత‌న…

Read More

ర‌హ‌దారి మరమ్మతులు చేయండి

హైదరాబాద్‌లో రోడ్లు, భ‌వ‌నాల చీఫ్ ఇంజనీర్‌కు గంట రవికుమార్ వినతి వ‌రంగ‌ల్ వాయిస్‌, వ‌రంగ‌ల్ : గుంతలు పడి, ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారిన వరంగల్ బట్టల బజార్ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు ఇత‌ర ఆర్ అండ్ బీ ర‌హ‌దారుల మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నేత గంట రవికుమార్ కోరారు. ఈ మేర‌కు హైదరాబాద్‌లో సోమవారం ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ (రోడ్స్ అండ్ సీ ఆర్ ఎన్) పి.రవీందర్ రావు, ఆర్…

Read More
Lawyer's brutal murder

లాయ‌ర్ దారుణ హ‌త్య‌

వ‌రంగ‌ల్ వాయిస్‌, ములుగు : ములుగు జిల్లాలో సోమ‌వారం రాత్రి ఏడు గంట‌ల ప్రాంతంలో లాయ‌ర్‌ను దారుణంగా హ‌త్య చేశారు. ములుగు జిల్లా కేంద్రానికి 11 కిలోమీట‌ర్ల దూరంలోని పందికుంట బస్టాఫ్ వద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలిసింది. హ‌త్య‌కు గురైన వ్య‌క్తి న్యాయవాది మల్లారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఎర్ర మట్టి క్వారీ.…భూ త‌గాదాలు.. పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
Heavy Rain

దంచికొట్టింది

గంటన్నర వర్షం.. ఆగమాగం చేసింది.. మహా నగరం అతలాకుతలం ఉప్పొంగిన డ్రైనేజీలు, నాలాలు ఎటూ చూసినా నీళ్లే ఎక్కడికక్కడా ట్రాఫిక్ జాంలు వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నగరం జలమయమైంది. సోమవారం మధ్యాహ్నం చడీచప్పుడు లేకుండా ఒక గంట పాటు జోరు వాన కురిసింది. దీంతో నగరంలోని కాలనీలు జలమయమైపోయాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లాయి. హనుమకొండ బస్టాండ్ ప్రాంగణం అంతా నీళ్లు చేరాయి. అలాగే కేడీసీ మీదుగా పెద్ద ప్రవాహం వెళ్లడంతో బస్టాండ్ నుంచి అశోక జంక్షన్…

Read More
Sincerity Carafe Sundar Raj

సిన్సియారిటీ కేరాఫ్ సుందర్ రాజ్

విద్యావేత్త నుంచి కుడా చైర్మన్‌ దాక సుందర్‌ రాజ్‌ యాదవ్‌ విజయ ప్రస్థానం ఉద్యమకారుడిగా, టీఆర్‌ఎస్‌ అధిష్ఠాన విధేయుడిగా పేరు అందరితో కలివిడిగా.. పార్టీకి ట్రబుల్‌ షూటర్‌గా.. చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ కు కుడిభుజంగా ప్రసిద్ధి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఘన సన్మానం తెలంగాణ ఉద్యమ కారుడు.. విద్యా సంస్థల అధిపతి.. టీఆర్ఎస్ క్రియాశీల నాయకుడు.. ఈ మూడు విభిన్న రంగాలకు వంద శాతం న్యాయం చేసిన సమర్థత సుందర్ రాజ్…

Read More
Costly bike will be robbed if seen..: Warangal CP Dr. Tharun Jyoshi

కాస్ట్ లీ బైక్ కనబడితే దోచేస్తారు..

ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్ రూ.13లక్షల విలువ చేసే బైక్ ల స్వాధీనం వివరాలు వెల్లడించిన తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను శనివారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 13 లక్షల విలువ గల ఎనిమిది ఖరీదైన ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్…

Read More
CP Dr. Tharun Jyoshi

నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: నేరస్థులకు పట్టుకోనేందుకుగాను పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులకు సూచించారు. ఆర్థ సంవత్సర నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా పోలీసు కమిషనర్ ముందుగా డ్రైవ్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, ఎస్సీ,…

Read More
Dasyam Vinay Bhaskar

వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్స్వనిధి మహోత్సవ్ ప్రారంభం వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: వీధి వ్యాపారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. శనివారం హన్మకొండ లోని అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన ‘‘పట్టణ ప్రగతి స్ట్రీట్ వెండర్స్ డెవలప్మెంట్ స్వనిధి మహోత్సవ్’’ కార్యక్రమాన్ని నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్…

Read More

తన భూమి.. ధరణిలో వేరొకరి పేరుతో..

ఆవేదనతో అనారోగ్యం బారిన పడి వ్యక్తి మృతి వరంగల్ వాయిస్, ఆరెపల్లి: తన భూమి ధరణి సైట్ లో మరొకరిపై పేరు రావడంతో ఆవేదనతో అనారోగ్యం బారిన పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వరంగల్ జిల్లాలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన పొగాకు మహేందర్ గౌడ్ గ్రామ గౌడ కుల పెద్దమనిషి. తనకు వారసత్వంగా వచ్చిన సర్వే నెం 565 లో 0.17 గుంటల భూమి ధరణిలో అదే గ్రామానికి చెందిన ఇతరుల పేరుపై రావడంతో గత సంవత్సరం…

Read More