Warangalvoice

పాఠశాలల వద్ద పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు

దామెర ఎస్సై కొంక అశోక్వరంగల్ వాయిస్, దామెర : విద్యా సంస్థల పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దామెర ఎస్సై కొంక అశోక్ హెచ్చరించారు. గురువారం ఆయన తన సిబ్బందితో కలిసి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.లాదెళ్ల, సింగరాజుపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు 100 గజాల లోపు ఉన్న కిరాణా షాపులపై దాడులు నిర్వహించి, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న నలుగురు యజమానులపై సీఓటీపీఏ-2003…

Read More

నిషేధిత ప్రాంతాల్లో పొగాకు విక్రయించొద్దు

శాయంపేట సీఐ రంజిత్ రావువరంగల్ వాయిస్, దామెర : పొగాకు ఉత్పత్తుల విక్రయం, వినియోగంపై ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని శాయంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.రంజిత్ రావు హెచ్చరించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఓటీపీఏ-2003 చట్టం అమలుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలు, కళాశాలల చుట్టుపక్కల 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నేరం. నిబంధనలు ఉల్లంఘించే దుకాణదారులపై కేసులు నమోదు చేసి, జైలుకు…

Read More

బాధిత కుటుంబానికి పరామర్శ సర్పంచ్

వరంగల్ వాయిస్, దామెర: మండలంలోని దమ్మన్నపేటగ్రామానికి చెందిన పాండవుల ఎల్లమ్మ అనారోగ్యంతో బుధవారం మృతిచెందింది. గ్రామ సర్పంచ్ దుబాసి నవీన్, స్థానిక నాయకులతో కలిసి ఎల్లమ్మ పార్ధివ దేహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తె లియజేశారు. వారివెంట ఉపసర్పంచ్ పాండవుల రాజు, పాలకవర్గ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Read More

గ్రామ అభివృద్ధిలో సిబ్బంది కీలక పాత్ర

వరంగల్ వాయిస్,శాయంపేట : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సింహులపల్లి గ్రామపంచాయతీ సిబ్బందిని బుధవారం రోజున ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న సిబ్బందికి గ్రామ ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి తిరుపతి  మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో గ్రామపంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ శుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వారి కృషి ప్రశంసనీయమని అన్నారు. వారి…

Read More

టెండర్ విధానంతో చేనేత కార్మికుల పొట్ట కొట్టొద్దు

బచ్చు ఆనందం ఆగ్రహంప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడనున్న వేలాది కుటుంబాలు టెండర్లు రద్దు చేయకుంటే భారీ ఎత్తున ఉద్యమిస్తాంహనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం వరంగల్ వాయిస్, హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త టెండర్ విధానం చేనేత కార్మికుల పాలిట శాపంగా మారబోతోందని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం మండిపడ్డారు. మంగళవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేనేత రంగాన్ని…

Read More

క్యూసీఓ అమలును వాయిదా వేయాలి

కేంద్రానికి తెలంగాణ కాటన్ అసోసియేషన్ విన్నపంవరంగల్ వాయిస్,వరంగల్ : కాటన్ బేల్స్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్-2023 అమలును ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయాలని తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం భారత ప్రభుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాయింట్ సెక్రటరీ (ఫైబర్) పద్మిని సింగ్లా అధ్యక్షతన నిర్వహించిన వాటాదారుల సంప్రదింపుల సమావేశంలో ఆయన ఆన్‌లైన్ ద్వారా పాల్గొని జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను వివరించారు. తెలంగాణలో పత్తి సాగు,…

Read More

మెరుగైన వైద్య సేవలు అందించాలి

కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్వరంగల్ వాయిస్, దామెర : విద్యార్థులు లక్ష్యశుద్ధితో, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె దామెర మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ సంస్థలను తనిఖీ చేసి, అభివృద్ధి పనులను పరిశీలించారు.  మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్, పాఠశాలలోని వంటగది, స్టోర్ రూమ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, నిల్వ…

Read More

గ్రామ అభివృద్ధిలో సిబ్బంది కీలక పాత్ర

వరంగల్ వాయిస్, దామెర:రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా  మండలంలోని దమ్మన్నపేట  గ్రామపంచాయతీ సిబ్బందిని మంగళవారం రోజున ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న సిబ్బందికి గ్రామ ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో గ్రామపంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ శుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వారి కృషి ప్రశంసనీయమని అన్నారు. వారి సేవలను గుర్తిస్తూ…

Read More

మార్త భిక్షపతికి ‘సేవారత్న’పురస్కారం

తిరుపతి సౌత్ ఇండియా కాన్ఫరెన్స్‌లో సత్కారంవరంగల్ వాయిస్, పరకాల : హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త మార్త భిక్షపతి ప్రతిష్టాత్మకమైన ‘సేవారత్న’ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన 18వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం జరిగిన ఈ వేడుకలో అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, తెలంగాణ ప్రభుత్వ అడ్వైజరీ బోర్డు సభ్యులు దరువు ఎల్లన్న, అవార్డు సెలెక్షన్ కమిటీ…

Read More

జనగణన పై సమీక్ష.

వరంగల్ వాయిస్ దామెర: మండల కేంద్రంలోని తహ సిల్దార్ కార్యాలయంలో సోమవారం తహసిల్దార్  జ్యోతి వరలక్ష్మి దేవి  జనగణన పై పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ఇళ్ల గుర్తింపు, క్లస్టర్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.జనగణనకు సరైన సమాచారం అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజేష్ కుమార్, ఆర్ఐ లు సంపత్ రావు, భాస్కర్ రెడ్డి, ఎంపిడిఓ కార్యాలయ…

Read More