District News
‘న్యాయవాది’ హత్యకేసులో నిందితుల రిమాండ్
వరంగల్ వాయిస్, ములుగు: న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో నిందితులకు ఈనెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. మల్లారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను ములుగు పోలీసులు శనివారం ఇన్ చార్జి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో 11 మంది నిందితులు పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోర్టు ముందు ఏ1 గోనెల రవీందర్, ఏ2 పిండి రవి యాదవ్, ఏ3 వంచ రామ్మోహన్ రెడ్డి,…
ధరలు తగ్గించాల్సిందే..
పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలి బీజేపీ, టీఆర్ ఎస్ దొందుదొందే కాంగ్రెస్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నిత్యావసర, పెట్రో, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ , హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రారం ధర్నా నిర్వహించారు….
నేనే సుప్రీమ్
బల్దియాలో నేను చెప్పిందే వేదం ఇతరులెవరూ ఎదగకుండా పక్కా ప్లాన్ డిప్యూటీ మేయర్‌పై చిన్నచూపు సంవత్సరం దాటినా కారు, క్యాంపు క్లర్కే లేరు నేటికీ స్టాండింగ్ కమిటీ ఊసే లేదు ఫ్లోర్ లీడర్లు లేరు.. ఆయా పార్టీలకు గదుల కేటాయింపూ లేదు.. రాజకీయాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత సీనియర్లు ఎవరైనా ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ కావాలనుకోవడం కామన్. కానీ, అందరికీ ఆ చాన్స్ రాదు. మరీ ఈ…
వరలక్ష్మీ నమోస్తుతే..
భక్తిశ్రద్ధలతో వ్రతాలు మహిళలతో కిటకిటలాడిన ఆలయాలు వరంగల్ వాయిస్, కాశిబుగ్గ: నగరంలోని 19వ డివిజన్ లో శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. ఓ సిటీలోని కోయిల్ కార్ కావ్య ఇంట్లో వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో జరిపారు. అలాగే పలు ఆలయాల్లో సంతోషిమాత వ్రతాల కోసం మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారిని కొలిచారు. శాయంపేటలో.. శాయంపేట మండల కేంద్రంలోని చారిత్రాత్మకమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతాన్ని దేవాలయ అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచారి ఘనంగా నిర్వహించారు….
నరేందర్ సైలెంట్ కాదు.. వైలెంట్
కార్యకర్తలకు అన్యాయం జరిగితే తిరగబడుతాం.. త్వరలో నియోజకవర్గ పర్యటన ఇది నా బర్త్ డే డిక్లరేషన్ నరేందర్ సైలెంట్‌గా ఉన్నాడు..ఎవరు ఏమన్నా పట్టించుకోడు అనుకుంటున్నారేమో.. నరేందర్ సైలెంట్ కాదు..వైలెంట్.. పార్టీని చీల్చుతామంటూ కొందరు చెప్పుకొంటున్నారు..పార్టీని కాదు నిన్నే చీల్చుతాం..చీల్చింది ఎలా అంటే నీవు పుట్టిన ఊరి వరకు వినిపించేలా ఉంటుందంటూ ఇటీవల పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఓ నేతనుద్దేశించి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఘాటుగా స్పందించారు. ఇది తన బర్త్ డే డిక్లరేషన్ అంటూ…
కన్నుల పండువగా
కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం వరంగల్ వాయిస్, రేగొండ: ప్రతి ఏటా శ్రావణ మాసంలో కొడవటంచ ఆలయంలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీ నరసింహస్వామి జన్మదిన స్వాతి నక్షత్రమైన శుక్రవారం కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్, ఆలయ చైర్మన్ మాదాడి అనిత కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం 11.00 నుంచి సామూహిక వరలక్ష్మి వ్రతాలలో 20 జంటలు, సామూహిక కుంకుమార్చనలలో 45 జంటలు పాల్గొనడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు గుర్రాల శ్రీనివాస్ రెడ్డి దంపతులు, శెట్టి…
ప్రజల ఆహ్లాదానికే పార్క్ ల ఏర్పాటు
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ న్యూ మిలినియం బ్యాంక్ కాలనీలో పార్క్ ప్రారంభం వరంగల వాయిస్, హనుమకొండ టౌన్: ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడానికి పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. శుక్రవారం బల్దియా పరిధి 49 వ డివిజన్ పరిధి న్యూ మిలినియం బ్యాంక్ కాలనీలో నూతనంగా అమృత్, సాధారణ నిధులు రూ.112.80 లక్షల అంచనా వ్యయం తో నిర్మించిన పార్క్ ను కమిషనర్ ప్రావీణ్యతో…
‘పీవీ’ ఆడియో విజువల్ ఆవిష్కరణ
వరంగల్ వాయిస్, హనుమకొండ: ఆబోప , వరంగల్ దర్శన్ చానల్ సంయుక్త ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు పై రూపొందించిన పి.వి.సంక్షిప్త జీవిత చరిత్ర -2022″ పి.వి.స్మారక అవార్డు ప్రదానోత్సవ సభ ఆడియో విజువల్ ను వరంగల్ దర్శన్ స్టూడియోలో ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా పి.వి.తనయుడు పి.వి.గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పి.వి.ప్రభాకర్ రావు విచ్చేసి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో అతిథులుగా పి.వి.ప్రభాకర్ రావు, సుడా చైర్మన్ జి.వి.రామకృష్టారావు, మాజీ శాసనమండలి సభ్యుడు…
పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్
ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై సీరియస్ ఆరుగురు యజమానులపై కేసులు చేయి చేసుకోవడంతో ముదిరిన వివాదం ఒక రోజు బంద్ పాటించి నిరసన ‘‘ప్రభుత్వానికి క్రమం తప్పకుండా లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నాం.. అలాగే అధికారులకు, పోలీసులకు నెలవారి మామూళ్లు అందిస్తున్నాం.. అడిగినప్పుడల్లా లిక్క ర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నాం.. ’’ ఇన్నీ చేస్తున్నా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపై బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే…
చికోటి ప్రవీణ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు
భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ వరంగల్ వాయిస్, హనుమకొండ: క్యాసినో చికోటి ప్రవీణ్ తో తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నామని అతడికి తమకు ఎలాంటి సంబంధం లేదని భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం హన్మకొండ అమృత థియేటర్ పరిధిలోని భవితశ్రీ చిట్ ఫండ్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాసినో చికోటి ప్రవీణ్ కి తమకు ఎలాంటి సంబంధం లేదని తమ సంస్థతో ఎలాంటి…