Warangalvoice

కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

భూములు కోల్పోయిన రైతులకు ఉపాధి కల్పించాలి కేయూ లైబ్రరీ వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకుల ధర్నా వరంగల్ వాయిస్, హనుమకొండ/ కేయూ క్యాంపస్ : కాజీపేట (అయోధ్యపురం)లో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేయూ జేఏసీ అధ్యక్షులు డి. తిరుపతి డిమాండ్ చేశారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ వద్ద జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వారు నిప్పులు…

Read More

నింగిలోకి దూసుకెళ్లిన ‘రుద్రమ’

ఓరుగల్లు గడ్డపై మోడల్ రాకెట్ ప్రయోగం సక్సెస్ వరంగల్ వాయిస్, హనుమకొండ : చారిత్రక వరంగల్ నగరం మరో అద్భుత ఘట్టానికి వేదికైంది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం భద్రకాళి బండ్ వద్ద నిర్వహించిన ‘రుద్రమ’ మోడల్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఏటీడీఆర్ఎల్, కుడా, వరంగల్ ఎన్ఐటీ సంయుక్త సమన్వయంతో చేపట్టిన ఈ ప్రయోగం విద్యార్థులలో, నగరవాసులలో నూతనోత్సాహాన్ని నింపింది. శనివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో శశాంక్ భూపతి నాయకత్వంలోని ఏటీడీఆర్ఎల్…

Read More
Prof_PanduRangarao

చరిత్ర, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి

రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు వికాస్ హైస్కూల్‌లో ‘ఇంటాక్’ డ్రాయింగ్ పోటీలు ‘లైఫ్ ఆఫ్ ట్రీ’ అంశంపై విద్యార్థుల ప్రతిభ విజేతలకు బహుమతుల ప్రదానం వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ రెడ్డి కాలనీలోని వికాస్ హైస్కూల్‌లో గురువారం ఇంటాక్ (INTACH) హనుమకొండ చాప్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. “లైఫ్ ఆఫ్ ట్రీ” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో నగరంలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 57 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని…

Read More

మహిళా భవన మంజూరుకు కృషి చేస్తా

వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని తక్కళ్లపాడు గ్రామంలో మహిళా భవన నిర్మాణ మంజూరు కోసం తన వంతు కృషి చేస్తానని ఎంపీడీవో గుమ్మడి కల్పన హామీ ఇచ్చారు. బుధవారం తక్కళ్లపాడు గ్రామస్తులు ఎంపీడీవోను కలిసి, గ్రామంలో మహిళా భవనం లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ మేరకు ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. మహిళా భవన నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎంపీడీవో…

Read More
Nagurla_venkateswalu

ఫర్టిలైజర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్లకు ఘన సన్మానం

గజమాలతో సత్కారం వరంగల్ వాయిస్, పరకాల : తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాగూర్ల వెంకటేశ్వర్లకు పరకాల ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నాగూర్ల వెంకటేశ్వర్లను గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరకాల ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంలో ఫర్టిలైజర్ షాపు వ్యవస్థ కీలకపాత్ర…

Read More

మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి

🔴 కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, ఎంపీ కావ్య విజ్ఞప్తి వరంగల్ వాయిస్, ఢిల్లీ: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిలో కీలకం కానున్న మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో కలిసి ఆమె కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడును పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో కలిశారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన…

Read More

వెలుగుల మేడారంగా తీర్చిదిద్దాం

🎯 విద్యుత్ శాఖ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి🎯 జాతరలో అత్యుత్తమ పనితీరు..🎯 సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత🎯 గోదావరి పుష్కరాలకు కూడా సిద్ధం 🎯 హనుమకొండలో ‘విద్యుత్ విజయోత్సవం’ వరంగల్ వాయిస్, హనుమకొండ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అన్ని శాఖల కంటే విద్యుత్ శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘మేడారం జాతర విద్యుత్ విజయోత్సవ’…

Read More

జ్వాలా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేత

వరంగల్ వాయిస్, ఆరేపల్లి : ఆరేపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఆటల పోటీలను నిర్వహించి, మొత్తం 140 బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, లోక్సత్తా ఉద్యమ సంస్థ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుంకరి ప్రశాంత్  హాజరై విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ…

Read More
warangal voice

కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ వరంగల్ వాయిస్, కాజీపేట : కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక నిరుద్యోగ యువతీ యువకులతోపాటు భూములిచ్చిన అయోధ్యపురం గ్రామస్థులకు 65 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ రైల్వే డిమాండ్ చేసింది. బుధవారం అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ డిమాండ్‌పై తెలంగాణ రైల్వే జేఏసీ, రాజకీయ జేఏసీ సాగిస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నియామకాల్లో…

Read More
konda sureka

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రూ.4.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. వరంగల్ వాయిస్, వరంగల్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మంగళవారం వరంగల్ (తూర్పు) నియోజక వర్గ పరిధిలోని 32,41 డివిజన్ లలో రూ.4.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ లు, సైడ్ వాల్ లు, బాక్స్ డ్రైన్…

Read More