District News
అనివార్యమైన జీవుడి జనన మరణాలకు అవి సంకేతాలు
రథసప్తమి జనవరి 28న సూర్యుడుదయించే తూర్పు దిక్కు అస్తమించే పడమటి దిక్కు రెండూ వందనీయాలు.కోటి సూర్యమండల మధ్యస్థమైన మహాత్రిపురసుందరీదేవి తన మూల స్థానాన్ని సూర్యుడియందే నిలుపుకున్నది. అంటే సౌరశక్తి అనంతశక్తి భాండాగారం. ఇంతటి పౌరాణిక, వైజ్ఞాజనిక ప్రాభవంతో వెలుగుతూ సృష్టి మొత్తాన్ని వెలిగించేది. కనుకనే రథసప్తమి పర్వదినమైంది. మాఘ సప్తమి తిథి నుండి సూర్య కిరణాలు వేడిని, వెలుగును, శక్తినీ, ధాతుపుష్టినీ మరింత సమృద్ధం చేసుకొని ప్రకృతికి పచ్చదనాన్ని, జీవులకు అంతరంగ దర్శనాన్ని వైజ్ఞానికులకు అన్వేషణా తీవ్రతను…
ఖమ్మంలో కంటివెలుగు రెండోదశ ప్రారంభం
సిఎం కెసిఆర్ చేతులవిూదుగా ప్రారంభించాలని నిర్ణయం సిద్దిపేటలో అధికారులతో సవిూక్షించిన మంత్రి హరీష్ రావు వరంగల్ వాయిస్,సిద్దిపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవదశ కంటివెలుగు ప్రారంభం ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడిరచారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర రాష్టాల్రకు చెందిన ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారని ఆయన తెలిపారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సులో మంత్రి…
రంగు రగడ
బీజేపీ పోస్టర్లపై కార్పొరేషన్ కలర్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నాయకుల వాల్ పోస్టర్లపై కార్పొరేషన్ అధికారులు రంగు వేయడం వివాదాస్పదంగా మారింది. ‘‘బీజేపీలో చేరండి..దేశ భద్రతను కాపాడండి..డయల్ టోల్ ఫ్రీ నెంబర్ 8980808080.. జాయిన్ ఇన్ బీజేపీ’’ అంటూ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు పేరిట మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో…
అభివృద్ధికి ఆమడ దూరంలో యాదవ నగర్
పేరుకే పట్టణ ప్రగతి…. పైసాలన్ని అధోగతి బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నగరం నడిబొడ్డున ఉన్న యాదవ్ నగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ విమర్శించారు. బుధవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా రావు పద్మ 4వ డివిజన్ అధ్యక్షుడు గొర్రె ఓం ప్రకాష్ అధ్వర్యంలో డివిజన్ పరిధిలోని యాదవ నగర్, గొల్లపల్లిలో ఇంటింటికీ తిరుగుతు కేంద్ర ప్రభుత్వం వరంగల్…
పట్టుదలతో విజయతీరం చేరాలి
వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు-2023 ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువజనోత్సవాల వేదిక ద్వారా యువత తమ ప్రతిభకు పదును పెట్టి ఉన్నత స్థాయిలో రాణించాలని సూచించారు. పట్టుదల,క్రమశిక్షణ,ఆకుంఠిత దీక్షతో యువలోకం విజయతీరాలను చేరుకోవాలన్నారు. అలాగని ఓడిపోతే ఓడిన చోటనే గెలుపు…
యువత కళలలో రాణించాలిములుగు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య
వరంగల్ వాయిస్, ములుగు: జిల్లా యువత కళలలో రాణించాలని కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ గార్డెన్స్ లో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి జానపద నృత్యాలు, జానపద గీతాలు, కబట్టి ,వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన…
రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
వరంగల్ వాయిస్ , క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం వెల్లడించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల కాలంలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా భీంపల్లి క్రాస్ రోడ్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, ఆర్అండ్ బీ…
కాజీపేట చౌరస్తాలో ఎంఎస్పి పార్టి జెండా ఆవిష్కరణ
వరంగల్ వాయిస్, కాజీపేట : కాజిపేట మండల కేంద్రము కాజీపేట చౌరస్తాలో ఎంఎస్పి పార్టీ మండల ఇంచార్జి చిలువేరు ఆశీర్వాదం మాదిగ ఆధ్వర్యంలో ఎంఎస్పి పార్టి జెండాను ముఖ్య అతిథిగా బండారు సురేందర్ మాదిగ విచ్చేసి ఆవిష్కరించారు. జనవరి 13. 14. 15. తేదిలలో మంద కృష్ణ మాదిగ ఆధ్యర్యంలో బెంగుళూర్ లో ఏర్పాటు చేసే సమావేశానికి అందరూ సన్నధం కావాలని పిలుపిపినిచ్చారు. ఈ కార్యకక్రంలో జేరుపోతుల సారంగపాణి మాదిగ, రేనుకుంట మహేశ్ మాదిగ, జేరుపోతుల సతీష్…
ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరూరి….
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల జాతర వాల్ పోస్టర్ ను బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ నెల 13నుండి ఉగాది వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు,…
అట్టహాసంగా వేముల నామినేషన్
మద్దతుగా టీఏజేఎఫ్, టీడబ్లూజేఎఫ్ నేతలు నాగరాజు గెలుపు ఖాయం: ఐజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ వరంగల్ వాయిస్, హనుమకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రధాన యూనియన్ అయినా టీయూడబ్ల్యూజే ఐజేయూ నుంచి వేముల నాగరాజు అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం సాయంత్రం 4.50గంటలకు ఐజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీతోపాటు జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, వివిధ యూనియన్ల ప్రతినిధుల ఆధ్వర్యంలో తన నామినేషన్ ను…