Crime
లారీ ఢీకొని యువకుడి మృతి
వరంగల్ వాయిస్, మల్హర్ : లారీ ఢీ కొని యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం మల్హర్ మండలంలోని నాగులమ్మ క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని అన్సాన్ పల్లి గ్రామానికి చెందిన అజ్మీరా శ్రీనివాస్(18) గురువారం అడ్వాలపల్లి లంబాడీ తాండాలోని తమ బందువుల ఇంట్లో జరుగుతున్న తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడానికి తన బైక్ పై బయలుదేరారు. మండలంలోని నాగులమ్మ క్రాస్ రోడ్ నుంచి మల్లారం మధ్యలో తాడిచెర్ల వైపు వేగంగా వెళ్తున్న బొగ్గు…
ఈతకు వెళ్లిన ఇద్దరు బాలుర గల్లంతు
ఒకరిని కాపాడిన స్థానికులు వరంగల్ వాయిస్, హనుమకొండ : గుండ్ల సింగారం కేనాల్ లో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. సెయింట్ తామస్ స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్న చరణ్, విగ్నేశ్వర్ సోమవారం సాయంత్రం గుండ్ల సింగారం కేనాల్ లో ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన వీరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిని యాదవ్ నగర్ సమీపంలో స్థానికులు గుర్తించి తాడు సహాయంతో రక్షించే ప్రయత్నం చేశారు. అయితే చరణ్ మాత్రం తాడు సహాయంతో ఒడ్డుకు…
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు
భార్యభర్తల మృతి వరంగల్ వాయిస్, పరకాల : నడి కూడ మండలం ధర్మారం గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం 6.30గంటల సమయంలో హనుమకొండ నుంచి పరకాలకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని పరకాలకే వస్తున్న కారు మితిమీరిన వేగంతో ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న పరకాల పట్టణ కేంద్రానికి చెందిన భార్య, భర్తల్లో భర్త పసుల మొగిలి (55) అక్కడికక్కడే మృతి చెందాగా భార్య సావిత్రికి (50) తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా…
ఈ దశాబ్దపు అతిపెద్ద రైలు ప్రమాదం
మూడు వందలకు పైగా మృతులు వేయికి పైగా క్షతగాత్రులు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని, సిఎం నవీన్ పట్నాయక్ మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ/బాలాసోర్ : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదమే ఈ దశాబ్ద కాలంలో జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదంగా భావిస్తున్నారు. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైల్లు ఢీకొన్న ఘటనలో 300మందికి పైగా మృతి చెందగా, వేయికి పైగా క్షతగాత్రులయ్యారు. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్…
ప్రీతిది ఆత్మహత్యే- వరంగల్ సీపీ రంగనాథ్
వరంగల్ వాయిస్, క్రైం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థిని ప్రీతి నాయక్ ది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. అయితే ఆమె ఆత్మహత్యకు సైఫ్ ప్రధాన కారణమన్నారు. ప్రీతి పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడైనట్లు ఆయన తెలిపారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో ఇంజెక్షన్ దొరికిందని, కానీ నీడిల్ దొరకలేదన్నారు. వారం పది రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జీ షీటును దాఖలు చేయనున్నట్లు…
బస్టాండులో డ్రైవర్ నిర్లక్ష్యం
బస్సు ఢీకొనడంతో విద్యార్థి మృతి బస్సు అద్దాలు ధ్వంసం చేసిన తోటి విద్యార్థులు వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ బస్టాండ్ లో డ్రైవర్ నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. విద్యార్థిని బస్సు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మిగతా స్టూడెంట్స్ బస్టాండులోనే ఉన్న నాలుగు బస్సుల అద్వాలను ధ్వంసం చేశారు. వీరితో పాటు ప్రయాణికులు కూడా ఆందోళనకు దిగారు. తన స్నేహితుడిని బస్సు ఎక్కించడానికి చింతా అనిల్ అనే విద్యార్థి…
సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నిరూపిస్తే, నేను ఉద్యోగం వదిలేసి పోతా
-వరంగల్ పోలీస్ కమిషనర్ పి.వి. రంగనాథ్ వరంగల్ వాయిస్, క్రైం: నేను సెటిల్ మెంట్లకు పాల్పడినట్లుగా నిరూపిస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతానని యం.పి బండి సంజయ్ కుమార్ వ్యాక్యలకు కౌంటర్ ఇచ్చారు వరంగల్ పోలీస్ కమిషనర్, నిన్నటి రోజున మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పై బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాక్యల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నన్ను…
అసాంఘీక శక్తులకు దూరంగా ఉండాలి
గొత్తికోయ గూడేన్ని సందర్శించిన డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి వరంగల్ వాయిస్, మహాముత్తారం : సమాజ శ్రేయస్సుకు హాని కలిగించే చట్ట వ్యతిరేక శక్తులకు దూరంగా ఉండాలని కాటారం డీఎస్పీ గడ్డం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని మద్దిమడుగు గొత్తికోయ గూడేన్ని కాటారం సీఐ రంజిత్‌రావుతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూడేంలో ఎవరైన కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీస్‌లకు సమాచారం అందించాలన్నారు. చట్టవ్యతిరేక సిద్ధాంతాలతో అడవుల్లో ఉండే మావోయిస్టులకు సహకరించొద్దని సూచించారు….
రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
వరంగల్ వాయిస్ , క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం వెల్లడించారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల కాలంలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా భీంపల్లి క్రాస్ రోడ్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులు, ఆర్అండ్ బీ…
యూట్యూబ్ లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి
దొంగనోట్ల ముఠా అరెస్ట్ నిందితులంతా ఉమ్మడి జిల్లా వారే వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సహాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రెండు వేల రూపాయల నోట్లు మూడు వందలు (ఆరులక్షలు), కలర్ ప్రింటర్, ఏడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు…