Warangal
గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటేయండి
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి వరంగల్ వాయిస్, వరంగల్ : తూర్పు నియోజకవర్గంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక సందర్బంగా గురువారం వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణా రెడ్డితో కలిసి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ వరంగల్ ఎల్ఐసీ మెయిన్ బ్రాంచ్, ఎంజీఎం ఎదురుగా గల ఎల్ఐ సీ బ్రాంచ్, పలు విద్యా సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులను కలసి వారితో ముచ్చటించారు. నిరుద్యోగులను మోసం…
తీన్మార్ మల్లన్నను గెలిపించండి
పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణ ప్రశ్నించే గొంతుక, నిజాన్ని నిర్భయంగా తెలిపే వ్యక్తి తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని, తెలంగాణ రాష్ట్ర పోపా అధ్యక్షుడు, న్యాయవాది, కాంగ్రెస్ నాయకులు శామంతుల శ్రీనివాస్ గురువారం శివనగర్ ప్రచారంలో పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులు, మేధావులు ఒక్కసారి అలోచించి ఓటు వేయాలని, కాంగ్రెస్ శ్రేణులు కొండా దంపతుల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికి తిరిగి విద్యావంతుల ఓటర్లను కాంగ్రెస్…
తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఇనగాల ప్రచారం
వరంగల్ వాయిస్, పరకాల : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను అధిక మెజారిటీతో గెలిపించాలని కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కోరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారం బుధవారం గీసుగొండ మండలం, 15,16వ డివిజన్ల పరిధిలోని మండల డివిజన్ల స్థాయి సన్నాహక సమావేశాన్ని మరియాపురం గ్రామంలోని నక్షత్ర ఫంక్షన్ హాల్ లో, సంగెం మండలం 17వ డివిజన్ స్థాయి సమావేశాన్ని సంగెం మండల కేంద్రంలోని గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ లో…
ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్నను గెలిపించాలి
బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు వరంగల్ వాయిస్, వరంగల్ : నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్రఅధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు పట్టబద్రులైన ఓటర్లకు పిలుపునిచ్చారు. బీసీ హక్కుల సాధన సమితి ఈ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ )కు సంపూర్ణ మద్దతును ప్రకటించిందన్నారు. గత పదేళ్లుగా పాలకుల…
ప్లాష్..ప్లాష్.. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ
వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోని నలుగురు డీఈఓలను…
కారుపై లింగాకారంలో గణపయ్య
నగరంలోని 20 డివిజన్ కాశిబుగ్గకు చెందిన వంగరి లక్ష్మీపతి బ్రదర్స్ ప్రతి ఏడు వినాయక నిమజ్జనంలో కొత్తదనాన్ని ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆనవాయితీని కొనసాగిస్తూ బుధవారం కారుపై శివలింగాకారంలో గణపతులను అందంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గణపయ్యను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. అనంతరం చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వంగరి కుటుంబ సభ్యులు వంగరి రాజశేఖర్, రవి, గుండు చంద్రమోహన్, దేవలపల్లి నరేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -వరంగల్…
విమోచనోద్యమం స్ఫూర్తితో మొదలైన.. మరో సమరం
మంత్రి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వరంగల్ వాయిస్, పరకాల : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి ఆనాటి త్యాగధనుల సేవలను ప్రజలకు తెలియజేస్తామని కేంద్ర కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి బైక్ ర్యాలీగా పరకాలకు విచ్చేసిన ఆయన అమరధామంలో నివాళులర్పించారు. పరకాల పట్టణంలోని అంగడి మైదానంలో హనుమకొండ జిల్లా…
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు
భార్యభర్తల మృతి వరంగల్ వాయిస్, పరకాల : నడి కూడ మండలం ధర్మారం గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం 6.30గంటల సమయంలో హనుమకొండ నుంచి పరకాలకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని పరకాలకే వస్తున్న కారు మితిమీరిన వేగంతో ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న పరకాల పట్టణ కేంద్రానికి చెందిన భార్య, భర్తల్లో భర్త పసుల మొగిలి (55) అక్కడికక్కడే మృతి చెందాగా భార్య సావిత్రికి (50) తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా…
రంగసాయిపేటలో బీరన్న బోనాలు
వరంగల్ వాయిస్, రంగసాయిపేట : ఈరోజు రంగసాయిపేటలో ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ బిరన్న దేవస్థానంలో బోనాల జాతర జరిగినది. ఆలయానికి ప్రధాన పూజారి మండల నర్సింహా రాములు, కుటుంబ సభ్యులతో ఆలయానికి పూజా సామాన్ల గంప నెత్తిపై ధరించి ఆలయానికి కురుమ కళాకారులు డప్పు చప్పులతో కళాకారులు ఆలయానికి విన్యాసాలు చేస్తూ ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం ఆలయ పూజారి స్వామివారి లింగాలను పాలాభిషేకం పసుపు బండారి తో అలంకరించారు స్వామివారి కంకణాలు పసుపు బండారి మరియు…
ప్రీతిది ఆత్మహత్యే- వరంగల్ సీపీ రంగనాథ్
వరంగల్ వాయిస్, క్రైం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థిని ప్రీతి నాయక్ ది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. అయితే ఆమె ఆత్మహత్యకు సైఫ్ ప్రధాన కారణమన్నారు. ప్రీతి పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడైనట్లు ఆయన తెలిపారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో ఇంజెక్షన్ దొరికిందని, కానీ నీడిల్ దొరకలేదన్నారు. వారం పది రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జీ షీటును దాఖలు చేయనున్నట్లు…