Warangal
సెప్టెంబర్17 ముమ్మాటికీ తెలంగాణ విలీన దినమే
సీనియర్ జర్నలిస్టు, హనుమకొండ : తెలంగాణలో నైజాం విముక్తి కోసం జరిగిన పోరాటానికి గుర్తుగాసెప్టెంబర్ 17ను ముమ్మాటికీ విలీన దినోత్సవంగానే గుర్తించాలి. నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఐక్యంగా పోరాటాలు చేశారు. కానీ బీజేపీ నేతలు హైదరాబాద్ సంస్థానంలోని విముక్తి పోరాటాన్ని ముస్లింలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సెప్టెంబర్17పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షోయబుల్లాఖాన్ ముస్లిం అయినప్పటికీ రజాకార్లు ఆయన చేతులు నరికారు. వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ…
అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు
దేశ రక్షణకు సైనికులు.. అటవీ రక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పిస్తున్నారు కొనియాడిన మంత్రి సురేఖ రేపు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం వరంగల్ వాయిస్, వరంగల్ : దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, దేశ సహజవనరులైన అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ అటవీ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సెప్టెంబర్ 11 సందర్భంగా అడవుల సంరక్షణకై…
రవ్వ ప్రసాదం పంపిణీ
వరంగల్ వాయిస్, కాశీబుగ్గ : కాశీబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా 2వ రోజు సాయంత్రం పూజ కార్యక్రమం అనంతరం 60 కిలోల రవ్వ కేసరి ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ వర్ధక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి, గుండేటి నరేంద్ర కుమార్, గుళ్ళపల్లి రాజకుమార్, గోరంటల మనోహర్, ఓరుగంటి కొమురయ్య, బోడకుంట్ల వైకుంఠం, మండల శ్రీరాములు, వంగరి రాంప్రసాద్, దుస్స కృష్ణ, బండారి రాజేశ్వరరావు, వంగరి రవి,…
వరంగల్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగరం మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయ సమావేశ మందిరంలో కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులతోపాటు పలు శాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
బీజేపీ కరీంనగర్ జిల్లా కో-ఇంచార్జిగా అనిల్
వరంగల్ వాయిస్, కరీమాబాద్ : భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన గోగికార్ అనిల్ కుమార్ ను బీజేపీ ఓబీసీ మోర్చ కరీంనగర్ జిల్లా కో-ఇంచార్జిగా నియమించారు. ఈ మేరకు ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు కోవా లక్ష్మణ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, బీజేపీ రాష్ట్ర…
అంగన్ వాడీలో బడిబాట
వరంగల్ వాయిస్, కరీమాబాద్ : నగరంలోని 40వ డివిజన్ కరీమాబాద్ సెక్టార్ పరిధిలోని సుభాష్ నగర్ (ఉర్సు) అంగన్ వాడీ కేంద్రంలో శనివారం బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ పిల్లలు..దేశానికి వెలుగు దివ్వెలు, ఒత్తిడి లేని విద్య..అంగన్ వాడీ విద్య, అంగన్ వాడీ ఒడి..అభివృద్ధిల బడి, తల్లీబిడ్డ క్షేమం..అంగన్ వాడీ ఆశయం అనే నినాదాలు ఆయా వాడల్లో మారుమ్రోగాయి. 30 నెలలు నిండిన పిల్లలను అంగన్ వాడీ కేంద్రానికి వచ్చేలా అలవాటు…
లక్ష మందికి మజ్జిగ పంపిణీ
వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లాలోని ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో మేదరి వాడ కార్యాలయం ముందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆర్యవైశ్య మిత్ర బృందం అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య మిత్రబృందం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం మజ్జిగ, అన్నదానం, ఉప్మా, అరటిపండు, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం 60 రోజులు 85 మంది దాతలు 2,700 కిలోల మజ్జిగ పెరుగు, ఆరువేల లీటర్ల వాటర్, మూడు క్వింటాల…
ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ల్యాదల్ల శరత్ వరంగల్ వాయిస్, వరంగల్ : జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, అనుమతి లేని కళాశాలల జాబితా విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఇంటర్ విద్యాశాఖ అధికారి డీఐఈఓ మాధవ్ రావుకు ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి ల్యాదల్ల శరత్ వినతి పత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న…
రైతులకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి
పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచర్ల బాలరాజు వరంగల్ వాయిస్, వరంగల్ : అఖిలభారత రైతుకూలీ సంఘం నర్సంపేట డివిజన్ కార్యవర్గ సమావేశం బుధవారం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు గట్టి కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోటే రెండు లక్షల రుణమాఫీ అమలు…
కార్మిక వర్గం హక్కులను కాపాడేదే సీఐటీయూ
ముక్కెర రామస్వామి జిల్లా కార్యదర్శి వరంగల్ వాయిస్, వరంగల్ : సీఐటీయూ 54 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీమాబాదు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నూతన జెండాను సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ సీఐటీయూ ఆవిర్భవించి నేటికి 54 సంవత్సరాలు అవుతుందన్నారు. ఐక్యత పోరాటం అనే నినాదాన్ని ఐదు దశాబ్దాల నుంచి ఆచరణలో పెట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. ముఖ్యమైన నినాదాన్ని ఆచరణలో…