పాఠశాలల వద్ద పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు
దామెర ఎస్సై కొంక అశోక్వరంగల్ వాయిస్, దామెర : విద్యా సంస్థల పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దామెర ఎస్సై కొంక అశోక్ హెచ్చరించారు. గురువారం ఆయన తన సిబ్బందితో కలిసి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.లాదెళ్ల, సింగరాజుపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు 100 గజాల లోపు ఉన్న కిరాణా షాపులపై దాడులు నిర్వహించి, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న నలుగురు యజమానులపై సీఓటీపీఏ-2003…