Crime
పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం
వరంగల్ వాయిస్,హనుమకొండ : కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేవ పథకాలలో భాగంగా వరంగల్ పోలీస్ కమీషనరేట్ టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం లభించింది. ఈ సందర్బంగా పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు పోలీస్ ఉన్నతాధికారులు,బంధుమిత్రులు,పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
కొండా సురేఖపై క్రిమినల్ కేసు ఫైల్ చేయండి
పోలీసులకు సూచించిన నాంపల్లి కోర్టు ఈ నెల 21 వరకు టైం.. మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం కేసులో సంచలన తీర్పు వరంగల్ వాయిస్, వరంగల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టు శనివారం పోలీసులను ఆదేశించింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో కొండా సురేఖపై ఈ నెల 21 లోగా నోటీసు జారీ…
బాలుడి గొంతు కోసిన దుండగులు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న ఏడేళ్ల బాలుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన చెందిన ఉపేందర్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించారు. ఈ క్రమంలో తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో తండ్రితో కలిసి నిద్రిస్తున్న ఉపేందర్ కుమారుడిపై దుండగులు కత్తితో…
అమ్మ బాబోయ్.. 120 చలాన్లు..!
ద్విచక్ర వాహనం స్వాధీనంవరంగల్ వాయిస్, కాజీపేట : వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకన్న తన సిబ్బందితో కలిసి బుధవారం కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలు చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన వాహనదారుడి ద్విచక్రవాహనానికి సంబంధించిన వివరాలను పరిశీలించగా ఏకంగా 120 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ అధికారులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. ఈ చలాన్ల మొత్తం రూ.32,165 కావడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు….
సర్టిఫికేట్ల తయారీ ముఠా అరెస్ట్
పోలీసుల అదుపులో 15 మంది పరారీలో మరో ఐదుగురు వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి వరంగల్ వాయిస్, క్రైం : రెండు వేర్వేరు సంఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగిస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ సర్టిఫికేట్లను తయారు చేసున్న రెండు ముఠాలకు సంబంధించిన 15 మంది కేటుగాళ్లను టాస్క్ ఫోర్స్, హనుమకొండ, మిల్స్ కాలనీ, కేయూసీ పోలీసులు, ఆర్టీఏ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో…
ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి…..వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ వాయిస్, క్రైం: ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ నెక్కొండ పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం నెక్కొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ తో పాటు…
ఫ్లాష్.. ఫ్లాష్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్ స్పెక్టర్ల బదిలీ
వరంగల్ వాయిస్, క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎన్.కరుణాకర్ సిసిఆర్బి నుండి మట్టెవాడ పోలీస్ స్టేషన్, టి. గోపి మట్టెవాడ నుండి వి. ఆర్, కె. సుజాత షీ టీం నుండి వరంగల్ ట్రాఫిక్, కె. రామకృష్ణ వరంగల్ ట్రాఫిక్ నునుండి వి. ఆర్ కు బదిలి అయ్యారు.
వైద్యురాలు మృతి కేసులో నలుగురు అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వరంగల్ వాయిస్, హసన్ పర్తి : యువ వైద్యురాలు అల్లాడి ప్రత్యూష ఆత్మ హత్యకు కారకులైన నలుగురిని హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని కాకతీయ వెంటేజ్ లోని స్వగృహంలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ…
డాక్టర్స్ కాపురంలో రీల్స్ చిచ్చు
‘బుట్ట బొమ్మ’పరిచయంతో కుటుంబంలో కలహాలు మనస్థాపంతో భార్య ప్రత్యూష ఆత్మహత్య నలుగురిపై కేసు నమోదు వరంగల్ వాయిస్, హసన్ పర్తి : ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న డాక్టర్స్ కాపురంలోకి బుట్ట బొమ్మ పేరుతో మరో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో.. పచ్చని కాపురంలో కలహాలు రేగాయి. భర్త ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని అనుమానించి భార్య.. అతనితో వాదనలకు దిగింది. అయిన ఆయనలో మార్పు కనిపించకపోవడంతో ఆత్మహత్యతో తనువు చాలించింది. ఈ దారుణం…
తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
వరంగల్ వాయిస్, సుబేదారి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తాడిచర్ల మండలానికి చెందిన ఉల్లిగంటి సంపత్ కుమార్తె, 9 సంవత్సరాల శ్రీ నిత్య, హనుమకొండ హంటర్‌రోడ్‌లోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో 5వ తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిత్య హాస్టల్ నుంచి అకస్మాత్తుగా బయటకు వెళ్లిపోయింది. అదే హాస్టల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బైరి ఉమా బాలిక కనిపించడం లేదని గుర్తించి ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సుబేదారి ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్…