Warangalvoice

ప్రభుత్వ కార్యాలయాల కోసం స్థల పరిశీలన

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ వాయిస్, దామెరదామెర మండలం నూతనంగా ఏర్పాటై దాదాపు 9 సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వ పక్క భవనాలు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుచున్న నేపథ్యంలో మండల కేంద్రంలోని దామెర గ్రామానికి వెనుక వైపున గల ప్రభుత్వ భూమిని చదును చేసి ముళ్ళ పొదలను తొలగించి సోమవారం మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మండల నాయకులతో  ఏ ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చట అనుకూలంగా…

Read More

ఉత్తమ అవార్డులు పొందిన ఉద్యోగులు

వరంగల్ వాయిస్,దామెర:దామెర మండలంలోని వివిధ శాఖలలో పని చేస్తు జిల్లా ఉత్తమ ఉద్యోగులుగా 77వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా వారికి అవార్డులు పొందిన ఎంపీడీవో గుమ్మడి కల్పన,మిషన్ భగీరథ ఏఈ నూనె వెంకటేష్,దామెర గ్రామపంచాయతీ కార్యదర్శి  మనోహర్, హనుమకొండ జిల్లాలో ఉత్తమ ఉద్యోగులుగా జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గుమ్మడి కల్పన మాట్లాడుతూ అవార్డు పొందడం ఆనందంగా ఉన్నప్పటికీ ప్రజలకు సేవలను అందించడంలో మరింత బాధ్యత పెరిగిందని…

Read More

వృద్ధుడి ప్రాణం కాపాడేందుకు ఎస్సై తాపత్రయం

వృద్ధుడి ప్రాణం కాపాడేందుకు ఎస్సై తాపత్రయంఎస్సై సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం వరంగల్ వాయిస్, దామెర : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని కాపాడేందుకు ఓ పోలీస్ అధికారి తన వంతు ప్రయత్నం చేశారు. నిమిషాల వ్యవధిలో స్పందించి ప్రాణవాయువు అందించే ప్రయత్నం చేసినా, విధి వెక్కిరించడంతో ఆ వ్యక్తి మృతి చెందారు. శుక్రవారం దామెర మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. దామెర గ్రామానికి చెందిన భాషబోయిన రాజాలు (58) శుక్రవారం…

Read More

కార్మికుల ఆరోగ్యమే లక్ష్యం

దామెరలో లేబర్ కార్డుదారులకు రక్త పరీక్షలుహెల్త్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ వరంగల్ వాయిస్, దామెర : కార్మికుల సంక్షేమం మరియు వారి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా దామెర మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో శనివారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. లేబర్ కార్డు కలిగిన కార్మికులకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి, అనంతరం వారికి హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దామెర గ్రామ సర్పంచ్ గారిగే కల్పనా…

Read More

పోలీసులను బ్లాక్‌మెయిల్ చేస్తే జైలుకే
సీఐ మల్లేష్ హెచ్చరిక

వరంగల్ వాయిస్, చిట్యాల : అక్రమాలకు పాల్పడుతూ, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిట్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.మల్లేష్ హెచ్చరించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గత నవంబర్ చివరి వారంలో చిట్యాల శివాజీ విగ్రహం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మోత్కూరు నరేష్ అనే వ్యక్తి 473…

Read More

త్వరలోనే నూతన బస్టాండ్ ప్రారంభం

వరంగల్ వాయిస్,చిట్యాల : ప్రతిష్టాత్మకమైన మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చిట్యాల మండల కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. శనివారం పరకాల బస్ డిపో మేనేజర్ (డీఎం) రామ్ ప్రసాద్ చిట్యాల గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఉపసర్పంచ్‌లను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. రాబోయే మేడారం జాతరను పురస్కరించుకుని, చిట్యాల ప్యాక్స్ (PACS) గ్రౌండ్‌లో తాత్కాలిక బస్ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ…

Read More

కాంగ్రెస్ దామెర సేవాదళ్ మండల అధ్యక్షుడుగా కొక్కుల ఓం ప్రకాష్

వరంగల్ వాయిస్,దామెర: దామెర మండల కేంద్రానికి చెందిన కొక్కుల ఓం ప్రకాష్ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొచ్చు చందర్ నియామక ఉత్తర్వులు అందించారు కొక్కుల ఓం ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పార్టీ ఎదుగుదలకు చేసిన సేవలను గుర్తించి నియామక ఉత్తర్వులను అందించినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా ఓం ప్రకాష్ మాట్లాడుతూ సేవాదళ్ మండల అధ్యక్షుడిగా నాపై నమ్మకంతో పార్టీ బాధ్యతలను అప్పగించడం పట్ల మరింత ఉత్సాహంతో పని చేస్తానని…

Read More

ప్రభుత్వ ఆదాయం 3.90 కోట్లగండి..

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్వరంగల్ వాయిస్, క్రైమ్ : రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతీ రిజిస్ట్రేషన్లలో 3.90కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రభుత్వ అదాయానికి గండి కొట్టిన మొత్తం ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేయగా, మరో తొమ్మిది మంది ప్రస్తుతం పరారీలో వున్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు 63.19 లక్షల నగదు, బ్యాంక్లో 1లక్ష రూపాయలు, సుమారు ఒక కోటి రూపాయల విలువైన…

Read More

ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, హనుమకొండ: బ్యాండ్ కళాకారుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని బ్యాండ్ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని ఏకశిల పార్కులో వరంగల్ అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రేటర్ అధ్యక్ష కార్యదర్శులు సూత్రపు అంజయ్య, కుక్కమూడి శంకర్ లతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు చాంద్ పాషా,…

Read More

మిన్నంటిన భోగి సంబరాలు
ఘనంగా భోగి మంటలు

పండుగ ఉత్సాహంలో గ్రామస్తులువరంగల్ వాయిస్, కమలాపూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి సంబరాలు కమలాపూర్ మండల కేంద్రంలో భోగి మంటలతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా ప్రగతి యూత్ ఆధ్వర్యంలో తెల్లవారుజామునే భోగి మంటల కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సందడిగా భోగి వేడుకలు – సర్పంచ్ సందడిగ్రామ నడిబొడ్డున మంటలు వెలిగించడంతో ఊరంతా పండుగ కళ సంతరించుకుంది. ఈ వేడుకలో సర్పంచ్ సతీష్ ప్రత్యేక ఆకర్షణగా…

Read More