Warangalvoice

నిరుపేద కుటుంబానికి అండగా ‘పేదల వకీల్’

25 కిలోల బియ్యం అందజేతవరంగల్ వాయిస్, గోవిందరావుపేట : నిరుపేద కుటుంబాల్లో విషాదం నెలకొన్నప్పుడు మానవత్వంతో స్పందించి ఆదుకోవడంలో యువత, స్వచ్ఛంద సంస్థలు ముందుండాలని అసైన్డ్ భూమి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, అడ్వకేట్ కలకోటి మహేందర్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన తిప్పారపు దుర్గమ్మ (75) ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మహేందర్ శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజా సంఘాల జేఏసీ నాయకుడు,…

Read More

సమాజంలో మహిళల పాత్ర కీలకం

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు వరంగల్ వాయిస్, దామెర : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం దామెర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముందస్తు వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. విధుల్లో అంకితభావంతో పనిచేస్తున్న మహిళా అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, తోటి సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ గుమ్మడి కల్పన, సూపరింటెండెంట్ సబ్జా రాణి, వారితో పాటు పంచాయతీ కార్యదర్శులు కవిత, సుకన్య, సిరివెన్నెల, ఏపీఓ శారద,  జూనియర్ అసిస్టెంట్…

Read More

పౌర హక్కులపై  అవగాహన కలిగి ఉండాలి

తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవివరంగల్ వాయిస్, దామెర : మండల కేంద్రంలో శనివారం ‘సివిల్ రైట్స్ డే’ (పౌర హక్కుల దినోత్సవం) కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక హక్కులు మరియు రక్షణ చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ…

Read More

పెద్దమ్మ తల్లి బోనాలు

వరంగల్ వాయిస్, దామెర: మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం ముదిరాజులు పెద్దమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం సభ్యులందరూ కొత్త దుస్తులను ధరించి బంధుమిత్రులు కుటుంబ సభ్యులు ఆనందంతో కొబ్బరికాయలు నైవేద్యం అమ్మవారికి సమర్పించి సాంప్రదాయం ప్రకారం యాట పిల్లలతో డప్పు చప్పుళ్లతో మొక్కులను సమర్పించి గ్రామ ప్రజలను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని పాడి పంటలతో తులతూగాలని అమ్మవారిని వారు వేడుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగిరి రాజు, ముదిరాజ్…

Read More

చెన్నకేశవ స్వామి జాతర కమిటీ ఎన్నిక

వరంగల్ వాయిస్, దామెర: దామెర మండలం కోగీల్వాయి గ్రామ పరిధిలోని శ్రీ చంద్రగిరి చెన్నకేశవ స్వామి జాతరను పురస్కరించుకొని, ఉత్సవాల నిర్వహణ కోసం నూతన జాతర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం గ్రామ సర్పంచ్ చుక్క వనిత మహేందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, భక్తుల సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. గౌరవ అధ్యక్షులుగా పెరుగు కుమారస్వామి యాదవ్, చైర్మన్ గా రమాకాంత్, వైస్ చైర్మన్లుగా పున్నం వేణు, జయశంకర్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు…

Read More

సర్పంచ్ పెళ్లి కానుక

వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని ఒగ్లాపూర్ గ్రామ సర్పంచ్ కేతిపెళ్లి శ్రీధర్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పట్ల మానవీయ దృక్పథంతో స్పందించి ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది నల్ల సబిత కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని, సర్పంచ్ శ్రీధర్ రెడ్డి తను సొంతంగా రూ.10,000 పెళ్లి కానుకగా అందజేశారు. శనివారం వారి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగదును కుటుంబ సభ్యులకు అందజేసి, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు….

Read More

ఉత్సాహంగా ‘సీఎం కప్’

నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు పూర్తివిజేతలకు బహుమతుల ప్రధానంవరంగల్ వాయిస్, దామెర: గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీలు పరకాల నియోజకవర్గ స్థాయిలో శనివారం అత్యంత ఉత్సాహభరితంగా ముగిశాయి. దామెర మండల కేంద్రంలోని డిస్నీల్యాండ్ హై స్కూల్ వేదికగా ఈ పోటీలు నిర్వహించబడ్డాయి. పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూర్, గీసుకొండ, సంగం మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామీణ, మండల స్థాయిలో ప్రతిభ చాటి…

Read More

యశోద హాస్పిటల్ లో హై రిస్క్ పేషెంట్లకు ఇన్వాసివ్ వాల్ మార్పిడి….

కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ జరివాలవరంగల్ వాయిస్, హనుమకొండ : యశోద హాస్పటల్స్ హైరిస్క్ పేషెంట్లకు మల్టీ డిస్ప్లేనరీ హార్ట్ టీం శస్త్ర చికిత్స చేయడం అత్యంత ప్రమాదకరమని భావించిన పేషెంట్లకు గుండె నిర్మాణం క్లిష్టంగా ఉన్నవారికి కాంప్లెక్స్ ట్రాన్స్ కాథేటర్ అయ్యోర్టిక్ వాల్వ్ రిప్లైసూమెంట్ అడ్వాన్స్డ్ కాంప్లెక్స్ కోరోనరి ఎంజీఓ ప్లాస్టి ప్రక్రియలను విజయవంతంగా నిర్వహిస్తుందని కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ జరివాల అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్ట లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన…

Read More

చక్రబంధం..

గంటల తరబడి ట్రాఫిక్ జామ్.వరంగల్ వాయిస్ ములుగు: తెలంగాణ కుంభమేళా, మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సర్కారు హంగు ఆర్భాటంగా చేసిన ప్రకటనలు, క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మిగిలాయి. కోట్లాది రూపాయల ఖర్చు, హైటెక్ హంగులు, ఏఐ (ఏఐ) నిఘా అంటూ గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ యంత్రాంగం, ట్రాఫిక్ నియంత్రణలో ఘోరంగా విఫలమై చేతులెత్తేసింది. గంటల కొద్దీ ‘చక్రబంధం’.. నరకప్రాయం ప్రయాణం.మేడారం వెళ్లే దారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి భారీ నరకాన్ని తలపిస్తున్నాయి….

Read More

భారీగా నకిలీ టీ పొడి సీజ్

వరంగల్ వాయిస్, దామెర : ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్న నకిలీ టీ పొడి ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. శుక్రవారం గూడెప్పాడ్ సెంటర్ సమీపంలోని ఎం.ఎం మార్ట్ లో వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 40 కిలోల నకిలీ టీ పొడిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి, మౌనిక స్థానికులకు, వినియోగదారులకు నకిలీ టీ పొడిని గుర్తించే విధానంపై…

Read More