Skip to main content

Warangalvoice

యశోద హాస్పిటల్ లో హై రిస్క్ పేషెంట్లకు ఇన్వాసివ్ వాల్ మార్పిడి….

కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ జరివాల
వరంగల్ వాయిస్, హనుమకొండ : యశోద హాస్పటల్స్ హైరిస్క్ పేషెంట్లకు మల్టీ డిస్ప్లేనరీ హార్ట్ టీం శస్త్ర చికిత్స చేయడం అత్యంత ప్రమాదకరమని భావించిన పేషెంట్లకు గుండె నిర్మాణం క్లిష్టంగా ఉన్నవారికి కాంప్లెక్స్ ట్రాన్స్ కాథేటర్ అయ్యోర్టిక్ వాల్వ్ రిప్లైసూమెంట్ అడ్వాన్స్డ్ కాంప్లెక్స్ కోరోనరి ఎంజీఓ ప్లాస్టి ప్రక్రియలను విజయవంతంగా నిర్వహిస్తుందని కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ జరివాల అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్ట లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పంకజ్ వినోద్ జరివాల మాట్లాడుతూ….తీవ్రమైన అయోర్ టిక్ వాల్స్ వ్యాధి అడ్వాన్స్డ్ వ్యాధులు ముఖ్యంగా వృద్ధులలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న పేషంట్ల హార్ట్ ఫెయిల్యూర్ కు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఇటువంటి పేషెంట్లకు సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం రిస్క్ తో కూడుకున్న పని సోమాజిగూడ హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వంటి అనుభవజ్ఞులైన డాక్టర్ల ఈ కేంద్రాలలో ఇటువంటి అడ్వాన్స్డ్ కాథెటర్ ఆధారిత చికిత్సలు సురక్షితమైన ప్రత్యామ్నాయలుగా మారుతున్నయని తెలిపారు.చాలామంది పేషెంట్లు నేడు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల సాధారణ సర్జరీ చేయించుకోలేని క్లిష్ట స్థితిలో ఉంటున్నారన్నారు . సరైన పేషెంట్లను ఎంపిక చేయడం టీం వర్క్ ద్వారా మినిమల్లి ఇన్వెర్సివ్ తెరఫీలైన కాంప్లెక్స్ పిసిఐలను అందిస్తూ రిస్కులు తగ్గించి వారి రికవరీ మెరుగుపరుస్తున్నామని తెలిపారు. యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ గత మూడు దశాబ్దాలుగా వైవిధ్యమైన వైద్య అవసరాలు కలిగిన ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందిస్తుందని తెలిపారు.హైదరాబాద్ లోనే యశోద హాస్పిటల్స్ కు సోమాజిగూడ సికింద్రాబాద్ మలక్ పేట హైటెక్ సిటీలలో నాలుగు స్వతంత్ర ఆస్పత్రులు ఉన్నాయని వీటిలో మొత్తం నాలుగు వేల బెడ్ల సమర్థం ఉంది యశోద గ్రూప్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను సరసమైన ధరలకే అందిస్తుందని 24 గంటల ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సదుపాయాలతో కూడిన హార్ట్ టీం మెడల్ అందుబాటులో ఉందన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గుండె చికిత్లను అందించడంలో ఆసుపత్రి తన నిబద్ధతను చాటుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో సంజీవ్ కుమార్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *