District News
కేహెచ్ సీ – 172 హైబ్రీడ్ బీజీ 2 బంపర్ పత్తి విత్తనాల వాడకం ఎంతో మేలు
వరంగల్ వాయిస్, వరికోలు : స్థానికి నడికుడ మండలం వరికోలులో కావేరీ సీడ్స్ కంపెనీ వారు బుధవారం రోజున కేహెచ్ సీ – 172 హైబ్రీడ్ బిజీ బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ క్షేత్ర ప్రదర్శలనలో స్థానిక వరికోలు రైతులే కాకుండా, నడికుడ మండల కేంద్రం నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాంబశివ రెడ్డి పంట పొలంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సాంబశివరెడ్డి మాట్లాడుతూ తాను…
వరికోలులో బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన
వరంగల్ వాయిస్, నడికుడ : కావేరీ సీడ్స్ కంపెనీ వారు మంగళవారం రోజున నడికుడ మండలం వరికోలులో బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ క్షేత్ర ప్రదర్శలనలో స్థానిక వరికోలు రైతులే కాకుండా, నడికుడ మండల కేంద్రం నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాంబశివ రెడ్డి వ్యవసాయ క్షత్రంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సాంబశివరెడ్డి మాట్లాడుతూ తాను చాలా కాలంగా కావేరీ కంపెనీ వారి బంపర్ ప్రత్తి…
కలెక్టరేట్ లో బతుకమ్మ సంబురాలు
వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అత్యంత ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మహిళా ఉద్యోగినులు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల వేడుకల్లో పాల్గొని అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగినులు వారి పిల్లలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పండుగ వేడుకలు మహిళల ఆటపాటల మధ్య అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి.మహిళలు బతకమ్మ పాటలకు చేసిన నృత్యాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించాయి. ఈ…
బల్దియాలో బతుకమ్మ వేడుకలు
వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జీడబ్ల్యూఎంసీ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖేడే, కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, గుండు చందన పూర్ణచందర్, ఈదురు అరుణ విక్టర్, జన్ను షిబారాణి, బస్వరాజు శిరీష, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్,…
కావేరీ కంపెనీ పత్తి విత్తనాల క్షేత్ర పదర్శన
వరంగల్ వాయిస్, దామెర : శనివారం రోజున దామెర మండలం పెంచికలపేటలో రైతు రవీందర్ వ్యవసాయ క్షేత్రంలో కావేరీ కంపెనీ వారి ప్రత్తి విత్తనాల క్షేత్ర పదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు రవీందర్ మాట్టాడుతూ తాను కావేరీ కంపెనీ వారి పత్తి విత్తనాలు వాడి అధిక దిగుబడులు సాధించానని, అంతే కాకుండా ఈ విత్తనాలు అధిక మన్నికతో ఉండడమే కాకుండా, చీడపీడలకు తావులేకుండా…
వరంగల్ వాయిస్ కథనానికి స్పందన
ప్రమాదం అంచున ప్రయాణం పేరిట వరంగల్ వాయిస్ లో ఈ నెల 3న ప్రచురితమైన కథనానికి బల్దియా అధికారులు స్పందించారు. ప్రమాదాలు జరుగకుండా శనివారం పాక్షికంగా ఏర్పాట్లు చేశారు. దారి పొడువునా కర్రలు పాతి వాటికి రిబ్బన్ లను అమర్చారు. దూరంనుంచి వచ్చే వాహనదారులకు సైతం కనిపించేలా వీటిని ఏర్పాటు చేశారు. అయితే పనులు త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేయించాలని కోరుతున్నారు….
మెడికల్ కాలేజీకి పార్థివ దేహం అప్పగింత
వరంగల్ వాయిస్, చెన్నారావుపేట : చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కోన్ రెడ్డి ఆయిల్ రెడ్డి (85) బుధవారం అనారోగ్యంతో మరణించగా వారి కుమారుడు రామ్మోహన్ రెడ్డి, భార్య ఉపేంద్ర, కుటుంబ సభ్యులు సమాజ హితం కోరి పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్ లో పార్థివ దేహాన్ని, పాకాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్…
ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు
వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ వరంగల్, హనుమకొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం’ వేడుకలను వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ లలితా దేవి, డాక్టర్ కె.వెంకటరమణ, డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ జన్ను కిరణ్ హాజరై ఫార్మసిస్టులను ఉద్దేశించి…
బాపూజీకి భారత రత్న ఇవ్వాలి
మాజీ ఎమ్మెల్యే వన్నాల వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్దంతి వేడుకలు ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. హనుమకొండ హంటర్ రోడ్ లోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవన్ ప్రాంగణంలోని బాపూజీ నిలువెత్తు విగ్రహానికి ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చేర్మన్,వర్దన్నపేట మాజీ శాసన సభ్యుడు వన్నాల శ్రీరాములు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ…
సహకార సంఘానికి రైతులే వెన్నెముకలు…
-సొసైటీ అధ్యక్షుడు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి వరంగల్ వాయిస్, చెన్నారావుపేట : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 67వ వార్షిక మహాసభ సొసైటీ అధ్యక్షుడు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. అనంతరం సీఈఓ రవి నివేదిక చదివి వినిపించాడు. కొందరు రైతులు నివేదికలో ఉన్నవి అన్ని తప్పులే అని వాపోయారు. అనంతరం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ త్వరలో రైతులకు కొత్త రుణాలు అందజేస్తామని తెలిపారు. ఈ వార్షిక మహాసభలో సొసైటీ మాజీ వైస్ చైర్మన్ తొగరు…