భారీగా నకిలీ టీ పొడి సీజ్
వరంగల్ వాయిస్, దామెర : ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్న నకిలీ టీ పొడి ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. శుక్రవారం గూడెప్పాడ్ సెంటర్ సమీపంలోని ఎం.ఎం మార్ట్ లో వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 40 కిలోల నకిలీ టీ పొడిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి, మౌనిక స్థానికులకు, వినియోగదారులకు నకిలీ టీ పొడిని గుర్తించే విధానంపై…