Skip to main content

Warangalvoice

GKM

రక్తదానం ప్రాణదానం..

వరంగల్ వాయిస్, దామెర : దామెర మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దామేశ్వరాలయంలో అభిషేకం అర్చన కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లను పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం వద్ద గల కళ్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  హనుమకొండ డైరెక్టర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు బిల్లా రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్…

Read More
damera news

దామెరలో ఫ్లెక్సీల రగడ

వరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా దామర మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు బిల్లా రమణారెడ్డి ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించి వేయడం ఉద్రిక్తలకు దారితీసింది. రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న సందర్భంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పుట్టగతులు ఉండవన్న భయంతోనే బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడి…

Read More

రక్తదానానికి కదిలి రండి

వరంగల్ వాయిస్, దామెర: పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం దామేశ్వరాలయంలో అభిషేకం, అర్చన కార్యక్రమాలను  నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు బిల్లా రమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ  పరకాల ప్రదాత రేవూరి ప్రకాష్ రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో సోమవారం బస్టాండ్ సెంటర్ లో కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేయనున్నట్లు…

Read More

తాడికొండ వెంకటరాజయ్య మృతి సమాజానికి తీరనిలోటు

మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు సంతాపం! వరంగల్ వాయిస్, హనుమకొండ :ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రఖ్యాత ఆచార్యులు తాడికొండ వెంకటరాజయ్య మరణ వార్త తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు వన్నాల శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గడించిన యోగ వ్యక్తిత్వ వికాస నిపుణులు, సామాజిక ఉద్యమకారులు,రచయిత ప్రజాజీవన పోరాటం కోసం అంకితమవుతున్న ఆచార్య వెంకట రాజయ్య హఠాన్మరణం పట్ల వన్నాల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.బహుముఖ ప్రజ్ఞాశాలి,బహుజన సమాజ ఆస్తి తెలంగాణలో…

Read More
damera news

విగ్రహ నిర్వాహకులకు అవగాహన సదస్సు

వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని వివిధ గ్రామాలలోని గణ పతి విగ్రహ నిర్వాహకులతో ఎస్సై అశోక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, విద్యుత్ అనుమతులు సౌండ్ సిస్టం ఏర్పాటు, భద్రత చర్యలు గురించి కమిటీ నిర్వాహకులకు వివరించారు.ఈ సదస్సులో ఏఎస్ఐ,కానిస్టేబుల్,గణపతి విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Read More

గణేష్ ఉత్సవ కమిటీలకు విద్యుత్ శాఖ వారి విన్నపం

వరంగల్ వాయిస్,దామెర: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  దామెరమండలంలోని అన్ని గ్రామాల గణేష్ ఉత్సవ కమిటీలకు, యూత్ క్లబ్ నిర్వాహకులకు విద్యుత్ శాఖ సూచనలను తప్పకుండా పాటించవలెనని దామెర  ఏఈ గుర్రం రమేష్ తెలిపారు. వినాయక విగ్రహాలను తీసుకుని వచ్చేటప్పుడు తొందరపడకుండా విద్యుత్ వైర్లను మరియు కేబుల్ వైర్లను గమనించి వాహనంలోనికి ఎక్కించడం దింపడం  చేయవలెను. కేబుల్ ఆపరేటర్లు కేబుల్ వైర్లను వినాయక విగ్రహాలకు తగలకుండా పైకి కట్టవలెను. లేనిచో వాటిని తొలగించడం జరుగుతుందని…

Read More
warangal voice

ఇందిరమ్మ ఇళ్లలో కమీషన్ల వివాదం

లబ్ధిదారుడిపై కాంగ్రెస్ నాయకుల దాడి ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు వరంగల్ వాయిస్, పర్వతగిరి : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమకు కమీషన్ ఇవ్వలేదనే కారణంతో ఒక లబ్ధిదారుడిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ నాయకులు దాడి చేసిన సంఘటన పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధితుడు ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. గ్రామానికి చెందిన కన్నే కల్పన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, మొదటి విడతలో…

Read More

స్వేచ్ఛా భారతం: గత వైభవం, వర్తమాన ప్రగతి, భవిష్యత్ ఆశయాలు

వరంగల్ వాయిస్, వరంగల్ :  భారతదేశం తన 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభసమయంలో, మన హృదయాలు గతాన్ని గుర్తు చేసుకుంటూ, వర్తమానాన్ని గర్వంగా చూస్తూ, భవిష్యత్తుపై అపారమైన ఆశలతో నిండిపోతాయి. నేడు మనం ఎగురవేస్తున్న త్రివర్ణ పతాకం కేవలం ఒక జెండా కాదు, అది లక్షలాది మంది వీరుల త్యాగాలకు, అలుపెరగని పోరాటాలకు, అపారమైన ఆశలకు ప్రతీక. ఈ పతాకం మన స్వేచ్ఛకు చిహ్నంగా రెపరెపలాడుతున్న ప్రతిసారీ, మనం గడిచిన ప్రయాణాన్ని, నేటి బాధ్యతను,…

Read More
bonalu

అమ్మవారికి తొలిబొనం

ఆదివారం కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వివిధ రూపాల్లో కొలువై ఉన్న అమ్మవారికి శ్రావణమాసం తొలి ఆదివారం కుమ్మర్లు తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ అమ్మ ఆశీస్సులతో సమాజం సుభిక్షంగా ఉండాలని, ఆ తల్లి చల్లని చూపులు మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ అమ్మకు బోనం సమర్పిస్తారని తెలంగాణ కుమ్మర్ల సంఘం, రాష్ట్ర అధ్యక్షులు బీసీ ఐక్య చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆకారపు మోహన్ అన్నారు. అయితే…

Read More
tgtwur jc mahabubabad

మాడిన అన్నం.. గొడ్డు కారం..

ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలో ఆహారం తినలేక పస్తులుంటున్న విద్యార్థులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీతో వెలుగులోకి మన బిడ్డలకు ఇలాగే పెడతామా అంటూ నిలదీత సాక్షాత్తు కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం నిత్యం సంచరించే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలోని విద్యార్థినులకు మాడిన అన్నం..గొడ్డు కారమే దిక్కైంది. తింటే తిను లేకుంటే పస్తులుండు అన్నట్లుగా అక్కడి వార్డెన్లు వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఒకవైపు విద్యార్థులకు మెరుగైన భోజనం…

Read More