Skip to main content

Warangalvoice

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలను నిర్వహించిన మంత్రి సీతక్క..

సీతక్క కు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రముఖులు

వరంగల్ వాయిస్,హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి  పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క శనివారం రాఖీ పండుగను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘనంగా జరిపారు. సోదర సోదరీమణుల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా సీతక్క స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హైదరాబాదులో అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, నేతల నివాసాలను సందర్శించారు. ప్రతి ఒక్కరి చేతికి రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా నాయకులు రాఖీ కట్టించుకుంటూ సీతక్క ను సొంత సోదరిగా భావించి “సోదరి సీతక్క” అంటూ ఆత్మీయంగా పలకరించి, ఆశీర్వాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.సీతక్క రాకతో సీఎం, మంత్రుల నివాసాలు సోదర భావంతో నిండిపోగా, పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. ఈ సందర్బంగా సీతక్క “రాఖీ పండుగ మన మధ్య ఉన్న అనుబంధాలను మరింత బలపరుస్తుందన్నారు . ఇలాంటి సోదర భావం, పరస్పర గౌరవం ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు.అలాగే ఉదయం తన నివాసమైన ప్రజాభవన్‌కు విచ్చేసిన ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ కి మంత్రి సీతక్క రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తన నివాసం కి విచ్చేసిన నాయకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందికి సీతక్క రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించి రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *