Skip to main content

Warangalvoice

vijay setupathi

విజయ్‌ సేతుపతిపై మహిళ ఫిర్యాదు

నేనేంటో నా కుటుంబానికి తెలుసన్న సేతుపతి

వరంగల్ వాయిస్ (సినిమా) : ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీక్రి వచ్చి స్టార్‌గా ఎదిగారు నటుడు విజయ్‌ సేతుపతి. ఆయనపై ఓ మహిళ ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ బాగా ఉందని ఆమె సోషల్‌విూడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. దీంతో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై విజయ్‌ సేతుపతి స్పందించారు. తన కుటుంబం ఎంతో బాధ పడిరదన్నారు. ఆమెపై తన టీమ్‌ సైబర్‌ కైమ్ర్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. నన్ను ఎన్నోఏళ్లుగా చూస్తున్నవారంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారు. నేనేంటో నాకు తెలుసు. ఈ రకమైన తప్పుడు ఆరోపణలు నన్ను బాధించలేవు. కానీ, నా కుటుంబం, సన్నిహితులు ఎంతో కలత చెందారు. ’వీటిని పట్టించుకోకండి. ఆమె ఫేమస్‌ కావడం కోసం కావాలని ఇలా చేస్తోంది. కొన్ని నిమిషాలపాటు- హైలైట్‌ అవుతుంది. పాపం ఎంజాయ్‌ చేయనీయండి’ అని వారితో చెప్పాను. మేము ఆమెపై సైబర్‌ కైమ్ర్‌లో ఫిర్యాదు చేశాం. ఏడు సంవత్సరాలుగా నేను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పటివరకూ దేనికీ భయపడలేదు. ఇలాంటివి ఎప్పటికీ నన్ను బాధించవు అని విజయ్‌ సేతుపతి వివరించారు. కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ బాగా ఉందని.. దీనివల్ల తన స్నేహితురాలు ఎంతో ఇబ్బందిపడిరదని రమ్య అనే ఓ మహిళ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టింది. విజయ్‌ సేతుపతి కూడా ఆమెను ఇబ్బందిపెట్టారని తెలిపింది. తన స్నేహితురాలు మానసికంగా కుంగుబాటుకు గురైందని పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఆమె తన పోస్ట్‌ను కొన్ని గంటల్లో డిలీట్‌ చేసింది. దీంతో విజయ్‌ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. విమర్శలు నిజమైతే పోస్ట్‌ ఎందుకు డిలీట్‌ చేశారని ప్రశ్నించారు. దీంతో ఆ మహిళ మరో పోస్ట్‌ పెట్టి వివరణ ఇచ్చింది. కోపంలో ఇలా చేశానని.. అది వైరల్‌ అవుతుందని ఊహించలేదని తెలిపింది. తన స్నేహితురాలి గోప్యత కోసం పోస్ట్‌ డిలీట్‌ చేసినట్లు- చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *