Skip to main content

Warangalvoice

మహిళలు ప్రతి రంగంలో ఉండాలి

వరంగల్ వాయిస్, దామెర :
హన్మకొండ జిల్లా దామెర  మండలం కేంద్రంలో దమ్మున్నపేట   గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళల సాధికారత, సమాజంలో మహిళల పాత్రపై ప్రత్యేకంగా చర్చించారు.ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల శక్తి, ప్రతిభ దేశాభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి రంగాల్లో మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు.ఈకార్య క్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *