🌀రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా. రియాజ్
🌀ఘనంగా పల్లె సీను పుస్తకావిష్కరణల ఉత్సవం
హన్మకొండ, అక్టోబర్11: నా చిన్ననాటి గురువు, కవి,రచయిత అయిన పల్లె సీను సాహిత్యం భవిష్యత్తు తరాలకు అమూల్యమైన సాహితీ సంపద అని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా రియాజ్ అన్నారు.
పల్లె సీను సహస్ర చంద్ర దర్శన వేళ ఆయన రచించిన ఐదు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం హరిత కాకతీయ లో ఘనంగా జరిగింది. శ్రీలేఖ సాహితి,వరంగల్లు స్వర్ణోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రియాజ్ విశిష్ఠ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె సీను లాంటి గురువు ఈ రోజుల్లో లేరని అన్నారు. ఆయన సాహిత్యం భవిష్యత్ తరాలకు గొప్ప మార్గదర్శిగా ఉంటుందని అన్నారు.
మరో అతిథి దహగాం సాంబమూర్తి మాట్లాడుతూ పల్లె సీను ఆలోచనలు సాహిత్య మూలలను పరిచయం చేస్తుందని, వచనా కవిత్వంపై ఆయనకు గొప్ప పట్టు ఉందని అన్నారు. అనంతరం ప్రముఖ రచయిత, శ్రీ లేఖా సాహితి ఉపాధ్యక్షులు పల్లె సీను రచించిన గగన తరంగాలు, మైత్రీ భావ తరంగాలు, పల్లె అంతరంగం, నేను కవిత్వాన్ని, నా సాహిత్య సంబంధాలు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐతా చంద్రయ్య, డా. మడత భాస్కర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డా రియాజ్,కందుకూరి శ్రీరాములు,
ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, డా. పర్చా అంజనీదేవి, టి. ఉడయవర్లు,డా.అమ్మిన శ్రీనివాసరాజు, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శంకేశి శంకర్రావు, వరిగొండ కాంతారావు , పల్లె నాగేశ్వర్ రావు డా. ఎన్ వి ఎన్ చారి, గుడిపాటి, డా. పల్లేరు వీరా స్వామి పల్లె సీను రచించిన పుస్తకాలను సభికులకు పరిచయం చేశారు. ఈ సమావేశంలో సాహితీ మిత్రులు, అభిమానులు పాల్గొన్నారు.
