ముగిసిన ఆషాడ మాసం
చివిరి అమావస్యను చుక్కల అమావాస్యగా పరిగణింపు వరంగల్జూ వాయిస్, 28(ఆర్‌ఎన్‌ఎ): నేడు చుక్కల అమావాస్య. ఆషాఢమాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు, దీని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలిసి ఉండదు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో ఒకే చోట సవిూపంగా చేరినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. తర్వాత సూర్యుని నుండి చంద్రుడు ప్రతిదినం…