షర్మిల నివాసం లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత
ఉస్మానియాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ షర్మిల వరంగల్ వాయిస్,హైదరాబాద్: ఉస్మానియాలో రోగులను పరామర్శించేందుకు వెళుతున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల నివాసం లోటస్ పాండ్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికని బయలుదేరిన వైఎస్‌ఆర్టీపీ చీఫ్ షర్మిలను పోలీసులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్ళనివ్వండని షర్మిల, పోలీసులను కోరారు. పోలీసుల వాహనంలో తీసుకెళ్లినా పర్వాలేదని…