అంగ రంగ వైభవంగా రాములోరి పెళ్లి
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు వరంగల్ వాయిస్, కాటారం : రాములోరి పెండ్లి వేడుకలు ఊరూరా ఘనంగా జరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి శ్రీధర్ బాబు సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు-తలంబ్రాలు సమర్పించారు. అలాగే కాటారం మండల కేంద్రమైన గారి పెళ్లి కాటారం చింతకాని తదితర గ్రామాల్లో ఆయా దేవతామూర్తుల ఆలయాలలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని పెళ్లి వేడుకలను తిలకించారు….