ఉపాధి హామీ పథకంపై నిర్లక్ష్యం
అధికారులు తీరుపై విమర్శలు వరంగల్ వాయిస్, వర్ధన్నపేట : మండలంలోని కడారి గూడెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంపై గ్రామస్తులు వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. గ్రామస్తులకు కావలసిన పనులు చేపట్టకుండా గ్రామానికి కావలసిన పనులను నిర్ణయించి వాటిపై గ్రామస్తులతో, కార్మికులతో చర్చించకుండా పనులు చేపట్టడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామం నుంచి చెరువులోకి వెళ్లే నీరుని సజావుగా వెళ్లనీయకుండా ఆపుతున్న కాలువను సక్రమంగా తీర్చిదిద్దకుండా దానిని నిర్లక్ష్యం చేస్తూ అనవసరంగా చెరువులో బొందలు…