District News
అంగ రంగ వైభవంగా రాములోరి పెళ్లి
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు వరంగల్ వాయిస్, కాటారం : రాములోరి పెండ్లి వేడుకలు ఊరూరా ఘనంగా జరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి శ్రీధర్ బాబు సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు-తలంబ్రాలు సమర్పించారు. అలాగే కాటారం మండల కేంద్రమైన గారి పెళ్లి కాటారం చింతకాని తదితర గ్రామాల్లో ఆయా దేవతామూర్తుల ఆలయాలలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది.మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని పెళ్లి వేడుకలను తిలకించారు….
మెట్టుగుట్టపై శ్రీ సీతారామల కల్యానోత్సవం
వరంగల్ వాయిస్, మడికొండ : దక్షిణ కాశీగా ప్రసిద్ది గాంచిన శ్రీ మెట్టుగుట్టపై నున్న శ్రీ సీతా రామచంద్ర స్వామి, శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రామనవమి బ్రమ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 10:30గంటల నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట శాసన సభ్యులు కెఆర్ నాగరాజు, జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుహాసిని హాజరై శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని…
ఊరూ..వాడా.. సీతారాముల కల్యాణ శోభ
కన్నుల పండువగా వేడుకలు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు వరంగల్ వాయిస్, వరంగల్ : సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను బుధవారం ఎస్ ఆర్ ఆర్ తోటలోని శ్రీ వీరాంజనేయ దేవాలయంలో కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ తంతు నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ కల్యాణోత్సవంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు వీలుగా ఎల్ ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. వివాహనంతరం భక్తులకు…
వాహనం నడిపిన మైనర్లపై కేసు
జువైనల్ హోమ్ కు తరలింపు వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు నడిపిన 8 మంది మైనర్లను గుర్తించి శుక్రవారం జువైనల్ కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేయగా, వీరికి రెండు రోజులు బాలల అబ్జర్వేషన్ హోం కు పంపినట్లు మట్టేవాడ సీఐ కె.శ్రీధర్ తెలిపారు. పోచమ్మ మైదాన్, ఎంజీఎం సెంటర్, పోతన రోడ్డు, బట్టల బజార్, హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లలో వాహనాలు నడుపుతున్న మైనర్ లను గుర్తించి…
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అరూరి రమేష్
వరంగల్ వాయిస్, వరంగల్ : గత మూడు రోజులుగా ఉత్కంట రేపిన అరూరి రమేష్ పార్టీ మారుడం ఎట్టకేలకు తెరవీడింది. బీఆర్ఎస్ పార్టీకి , వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవకీ రాజీనామ చేస్తున్నట్లు లేఖ విడిదలజేసారు. అదే విధంగా ఇంతకాలం పార్టీలో అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు గార్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు…
వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ
వేదిక శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగిన దేవాలయం వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలోని పెడపల్లి డబ్బాల క్రాస్ వద్దగల శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ కాసాంజనేయ స్వామి అయ్యప్ప సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో రెండో సామూహిక పడిపూజ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. గురు స్వామి జానకి రామయ్య ఆధ్వర్యంలో పడిపూజను వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు…
అత్తను తుపాకీతో కాల్చిన అల్లుడు
అక్కడికక్కడే మృతి వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆదప్రసాద్ గురువారం హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం ప్రాంతానికి చెందిన తన అత్త కోమలను సర్విస్ రివాల్వర్ తో కాల్చి చంపాడు. స్థానికులకు కథనం ప్రకారం.. ప్రసాద్ కు ఇవ్వవలసిన రూ.4 లక్షల విషయంలో గత కొంత కాలంగా అత్తా, అల్లుడి మధ్య వివాదం జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం…
ప్లాష్..ప్లాష్.. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ
వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోని నలుగురు డీఈఓలను…
బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష
మహబూబాబాద్ కోర్టు సంచలన తీర్పు మూడేళ్ల క్రితం ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ లో మూడేళ్ల క్రితం తొమ్మిది సంవత్సరాల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్ కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జిల్లా కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు న్యాయ దేవత, పోలీసుల చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే..మహబూబాబాద్ పట్టణంలోని…
అధికారంలోకి రాగానే.. కేసీఆర్ చర్లపల్లి జైలుకే
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వరంగల్ వాయిస్, హనుమకొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా చర్లపల్లి జైలుకే పంపిస్తామని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న సమావేశం దేశ, రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారనుందన్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పురించబోతున్నామని ఆయన ప్రకటించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ…