రిపోర్టర్ నారద – లోకకళ్యాణార్ధం
దేవర్షి నారద జయంతి పాత్రికేయులకు ఆది పురుషుడు నారద మహాముని ‘వార్తయందు జగము వర్ధిలులచున్నది యదియు లేని నాడ యఖిలజనులు సంధకార మగ్నులగుదురు గాన వార్త నిర్వహింపవలయుజతికి’ అంటాడు నారదుడు. వార్త అంటే సమాచారమనీ నాటి అభిప్రాయం. వార్త అంటే సమాచారం, సమాచరమే విజ్ఞానం. సమాచరమే అధికారం. సమాచారం అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇటు సమాచార రంగానికి, అటు పాత్రికేయులకు ఆది పురుషుడు నారద మహాముని ఆయన సమాచారాన్ని లోక కల్యాణానికి ఉపయోగించారు. రాజసూయానికి ముందు ధర్మరాజు…