Skip to main content

Warangalvoice

వివేక్ హార్ట్ క్లినిక్ ప్రారంభించిన డాక్టర్ కే మనోహర్.


వరంగల్ వాయిస్ హన్మకొండ: హనుమకొండలోని కాలేజీ కళాక్షేత్రం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కు అతి సమీపంలో  ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వివేక్ నరసింహ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేక్ హార్ట్ క్లినిక్ ను ఆదివారం ప్రముఖ వైద్యులు, మాజీ నిమ్స్ డైరెక్టర్ డా. కె  మనోహర్, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ వివేక్ నరసింహ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వరంగల్ ట్రైసిటీలో అత్యాధునిక గుండె చికిత్సను అందించడం కోసం  డాక్టర్. వివేక్ నరసింహ నూతనంగా హాస్పటల్ ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. అనంతరం వివేక్ హార్ట్ క్లినిక్ యం.డి డా. వివేక్ నరసింహ మాట్లాడుతూ…అత్యాధునిక వైద్య పరికరాలతో, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో గుండెకు సంబంధిత సమస్యల పరిష్కారానికి వైద్యాన్ని అందించడం మా ప్రత్యేకత అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా.సాంబశివరావు, డా. చంద్ర శేఖర్, డా. వివేక్ నరసింహ కుటుంబ సభ్యులు,శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *