Skip to main content

Warangalvoice

సర్పంచ్ పెళ్లి కానుక


వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని ఒగ్లాపూర్ గ్రామ సర్పంచ్ కేతిపెళ్లి శ్రీధర్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పట్ల మానవీయ దృక్పథంతో స్పందించి ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది నల్ల సబిత కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని, సర్పంచ్ శ్రీధర్ రెడ్డి తను సొంతంగా రూ.10,000 పెళ్లి కానుకగా అందజేశారు. శనివారం వారి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగదును కుటుంబ సభ్యులకు అందజేసి, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాయతీ సిబ్బందిని తన కుటుంబ సభ్యుల్లా భావించి, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తున్న సర్పంచ్ తీరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *