Skip to main content

Warangalvoice

స్మైల్ స్కూల్ కరస్పాండెంట్‌పై దాడి కేసు
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు


వరంగల్ వాయిస్, హనుమకొండ: కుమార్ పల్లిలోని డీజీ స్మైల్ స్కూల్ కరస్పాండెంట్పై దాడి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేసిన కేసులో నిందితులైన విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివ కుమార్ తెలిపారు. పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజయ్, కార్యదర్శి మహేష్ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ మహాసభలకు చందా డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడి, స్కూల్ కరస్పాండెంట్‌పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *