రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభంజనం
వైసిపి అరాచాకాలతో విసిగిపోయిన జనం మాజీమంత్రి ఎన్‌ఎండి ఫరూక్ వరంగల్ వాయిస్,నంద్యాల: ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో అధికార వైసిపికి కౌంట్‌డౌన్ మొదలయ్యిందని మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండి ఫరూక్ అన్నారు. వైసిపి పాలనతో ప్రజలు విసిగి పోయారని అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసిపికి చెల్లుచీటి పలకడం ఖాయమని అన్నారు. పులివెందుల గడ్డ నుంచే తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్ని ఎగురవేసిందని, జగన్ పతనం అక్కడి నుంచే మొదలైందని…