Warangalvoice

Rakesh Siddoju

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

వరంగల్ వాయిస్,హైదరాబాద్ :రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని  రాష్ట్ర అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టారు.ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ తనకు సొంత సోదరి లాగా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తన ఆప్యాయతను వ్యక్తం చేశారు.అన్న చెల్లెళ్ల,అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని చాటే రాఖీ పండుగ ప్రతి ఒక్కరు ఆనందోత్సావాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు…

Read More

వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాలు మెరుగుపర్చాలి…ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలంటూ శుక్రవారం పార్లమెంట్ లో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ప్రధానంగా గ్రామీణ మెడికల్ కళాశాలల్లో డాక్టర్లు, సిబ్బంది, అధ్యాపకుల నియామకాలు, ల్యాబ్స్, లైబ్రరీలు, హాస్టళ్లు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ టూల్స్ గ్రామీణ సేవలకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై వరంగల్ ఎంపీ వివరణ కోరారు. గ్రామీణ మెడికల్ కళాశాలల్లో సదుపాయాలను…

Read More

పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం

వరంగల్ వాయిస్,హనుమకొండ : కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేవ పథకాలలో భాగంగా వరంగల్ పోలీస్ కమీషనరేట్ టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం లభించింది. ఈ సందర్బంగా పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు పోలీస్ ఉన్నతాధికారులు,బంధుమిత్రులు,పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Read More

ఘనంగా శ్రీ వారహి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం

వరంగల్ వాయిస్, హనుమకొండ :నగరంలోని కుమార్ పల్లి లో శ్రీ వారహి హోటల్ చైర్మన్ సుమన్ ఆధ్వర్యంలో గురువారం  నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వారహి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ను స్థానిక కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి మాట్లాడుతూ వారహి హోటల్ నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఈ యొక్క హోటల్ లో ఏసీ మల్టీ క్యూసిన్,ఫ్యామిలీ రెస్టారెంట్, బ్యాంకెట్ హల్స్, బోర్డు రూమ్స్, కాన్ఫరెన్స్…

Read More

నేచర్ 369 ఫ్యామిలీ రెస్టారెంట్ గ్రాండ్ లాంచింగ్‌

   ఏసీ రెస్టారెంట్ ఘ‌నంగా ప్రారంభోత్స‌వం వరంగల్ వాయిస్, హనుమకొండ :హనుమకొండ పెద్ద‌మ్మ‌గ‌డ్డ‌- కేయూసీ రోడ్‌లోని కొత్తూర్ మిర్యాల్‌కార్ కాంప్లెక్స్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన నేచర్ 369 ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్స‌వం క‌న్నుల‌పండుగగా జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం న‌గ‌ర కార్పొరేట‌ర్లు పోతుల శ్రీమాన్‌, తోట వెంక‌న్న‌, చెన్నం మ‌ధు, బొంగు అశోక్‌యాదవ్, మాజీ కార్పొరేట‌ర్ మిర్యాల్‌కార్ దేవేంద‌ర్ హాజరై లాంచ‌నంగా ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. న‌గ‌ర ప్ర‌జ‌లకు నాణ్య‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన వంట‌కాల‌ను అందించాల‌ని, ప్ర‌ముఖ హోట‌ళ్ల…

Read More

పరకాలలో పర్యటించిన కేటీఆర్..

వరంగల్ వాయిస్, పరకాల : గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  అధ్యక్షతన,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి  సహకారంతో పోచంపల్లి ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఆదివారం పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ లో మహిళలకు కుట్టు మిషన్లు,కేసీఆర్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో  బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పరకాల, నడికుడ మండలాలకు చెందిన మహిళలకు కుట్టు మిషన్లు,కేసీఆర్ కిట్లను అందచేశారు.అనంతరం పరకాల…

Read More

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి…..వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం: ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ నెక్కొండ పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం నెక్కొండ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ తో పాటు…

Read More

ఫ్లాష్.. ఫ్లాష్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్ స్పెక్టర్ల బదిలీ

వరంగల్ వాయిస్, క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో  ఎన్.కరుణాకర్ సిసిఆర్బి నుండి మట్టెవాడ పోలీస్ స్టేషన్, టి. గోపి మట్టెవాడ నుండి వి. ఆర్, కె. సుజాత షీ టీం నుండి వరంగల్ ట్రాఫిక్, కె. రామకృష్ణ వరంగల్ ట్రాఫిక్ నునుండి వి. ఆర్ కు బదిలి అయ్యారు.

Read More

ఈ నెల 13 న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష

వరంగల్ వాయిస్, హనుమకొండ:రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీ లలోని 3 సంవత్సరాల ఇంజనీరింగ్,నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా ప్రవేశం కోసం జరిగే పాలీసెట్-2025ను ఈ నెల 13వ తేదీ (మంగళవారం) రోజున ఉ. 11.00 గం.నుండి మ. 1.30 గం. వరకు నిర్వహించనున్నట్లు, ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా. బైరి ప్రభాకర్ తెలిపారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ డా….

Read More